News January 13, 2026

వికారాబాద్: ‘రెబల్’ బెడద తప్పేనా?

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన పార్టీలు వేట మొదలుపెట్టాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో రెబల్ అభ్యర్థుల బెడద లేకుండా ఉండేందుకు నాయకులు దృష్టి సారించారు. విజయ అవకాశాలు, సామాజిక సమీకరణాలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసేందుకు అన్ని పార్టీల పెద్దలు పావులు కదుపుతున్నారు.

Similar News

News February 12, 2026

KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

image

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.

News February 12, 2026

అల్లూరి: రైతులకు అందుబాటులో డ్రోన్ సేవలు

image

రైతులకు అద్దె ప్రాతిపదికన డ్రోన్ల సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉబెరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో యాప్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేసి, తక్కువ ఖర్చుతో పంటలపై మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు డ్రోన్ సాంకేతిక ఎంతో అవసరమన్నారు. సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 12, 2026

NTR: KGBVలో కలకలం.. 11 మంది విద్యార్థినులకు ఎలుక కాటు!

image

ఏ.కొండూరులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం రాత్రి కలకలం రేగింది. పాఠశాలలో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు పాఠశాల లోపలే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.