News March 13, 2025

వికారాబాద్: విషాదం.. యువకుడి మృతి

image

వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం వద్ద జరిగిన <<15741649>>రోడ్డు ప్రమాదంలో<<>> మోత్కూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, ధన్‌రాజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని స్థానికులు పరిగి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధన్‌రాజ్ ఈరోజు తెల్లవారుజామున మరణించాడని, సాయి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News March 13, 2025

వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

image

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.

News March 13, 2025

జర్నలిస్టుల అరెస్ట్‌పై కపిల్ సిబల్ అసహనం.. పూనమ్ రిప్లై!

image

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇలా అరెస్టులు చేయడం పరిష్కారం కాదని, ఇది అంటువ్యాధిలాంటిదని మండిపడ్డారు. ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు సినీ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘ఆమె ఇతర మహిళలకు పరువు నష్టం కలిగించడమే అజెండాగా పనిచేస్తుంది. నేనూ ఆమె బాధితురాలినే’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీశ్

image

TG: CM రేవంత్ అసెంబ్లీలో, బయటా అసత్యాలే మాట్లాడుతున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని హరీశ్ రావు విమర్శించారు. TVVP డాక్టర్లు, నర్సులు, హోం గార్డులు సహా ఇతర సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ’13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని TVVP సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. దుష్ప్రచారంతో ఇంకెంత కాలం వెళ్లదీస్తారు?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!