News February 3, 2025
వికారాబాద్: సమస్యలకు సత్వరం పరిష్కారం: కలెక్టర్ ప్రతీక్

శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 106 ఫిర్యాదులు రావడం జరిగిందని వివిధ శాఖల అధికారులు పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News January 29, 2026
ఉలవ పంటలో కాయ తొలుచు పురుగు నివారణ

ఉలవ పంట పూత, పిందె ఏర్పడే దశలో కాయ తొలుచు పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆశిస్తే పంటకు తీవ్ర నష్టం సంభవిస్తుంది. కాయతొలుచు పురుగు వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువ. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20% E.C 2.5MLను కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఈ పురుగును గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలి.
News January 29, 2026
KNR: మున్సిపల్ పోరు.. టికెట్ల కోసం ‘జంపింగ్’ల జోరు

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల వేళ టికెట్ల వేటలో నేతలు పార్టీల గీతలు దాటుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరగడంతో ‘జంపింగ్ జిలానీల’ సందడి నెలకొంది. ఆయా పార్టీల్లో సీటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తూ సమీకరణాలను మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం దక్కుతుందన్న అంచనాతో, జెండాలు మారుస్తున్న నేతల తీరుతో నగర రాజకీయం వేడెక్కింది.
News January 29, 2026
అతివేగం, మద్యం తాగి వాహనం నడపకండి: ఎస్పీ

ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 200 మంది డ్రైవర్లకు ECG, 2డీ ఎకో, కంటి, దంత పరీక్షలను GGH వైద్యుల చేత నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదని, అది మనందరి కర్తవ్యమని అన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని సూచించారు.


