News December 13, 2025
వికారాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. పూర్తి వివరాలు

రేపు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ డివిజన్లోని 175 జీపీలు, 1520 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ మండలం 21, ధరూర్ 34(5 ఏకగ్రీవం), మోమిన్‌పేట్ 29, నవాబుపేట 32(2 ఏకగ్రీవం), బంట్వారం 12, మర్పల్లి 29(3 ఏకగ్రీవం), కోట్పల్లి 18 (5 ఏకగ్రీవం) GPలు ఉన్నాయి. ఏకగ్రీవాలను మినహాయించి మిగతా GPలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News December 14, 2025
ఏలూరు: 1,127 మంది డుమ్మా..!

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలను ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం 11 కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 2,311 మంది హాజరు కావలసి ఉండగా 1,184 మంది హాజరయ్యారన్నారు. 1,127 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి 2, పెదవేగి నవోదయ వైస్ ప్రిన్సిపల్ 1, అసిస్టెంట్ కమిషనర్ 4 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం అందించారు.
News December 14, 2025
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో భారీ మార్పులు

AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో బోర్డు మార్పులు చేసింది. గతంలో 6 సబ్జెక్టులు(ఇంగ్లిష్-100, లాంగ్వేజెస్-100, మ్యాథ్స్A-75, మ్యాథ్స్B-75, ఫిజిక్స్-60, కెమిస్ట్రీ-60, బోటనీ-60, జువాలజీ-60) ఉండగా ఈసారి ఐదుకు కుదించింది. ఇంగ్లిష్-100, లాంగ్వేజెస్-100, మ్యాథ్స్-100, ఫిజిక్స్-85, కెమిస్ట్రీ-85, బయాలజీ(బోటనీ+జువాలజీ)-85 మార్కులు ఉంటాయి. సెకండియర్‌లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.


