News March 14, 2025
వికారాబాద్: హోలీ.. మార్కెట్‌లు బిజీ.. బిజీ..!

నేడు హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలోని మార్కెట్లన్నీ బిజీ.. బిజీ.. అయిపోయాయి. అధిక మోతాదులో హోలీ రంగులు కొనుగోలు చేసేందుకు తక్కువ ధరకు లభించే దుకాణాల వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. రంగులు పిచికారీ చేసే స్ప్రేయర్లు, పిల్లల కోసం స్పెషల్‌గా రకరకాల గన్ స్ప్రేలు, బ్యాగ్ స్ప్రేలు, బుల్లెట్ స్ప్రేలు వంటివి చిన్న పిల్లల కోసం మార్కెట్‌లో లభిస్తున్నాయి.
Similar News
News December 15, 2025
జోర్డాన్‌కు చేరుకున్న మోదీ.. ఢిల్లీలో ముగిసిన మెస్సీ టూర్

⋆ రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన
⋆ ఢిల్లీలో ముగిసిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్‌ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్‌ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా
News December 15, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 15, 2025
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం విషాదం నెలకొంది. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


