News February 18, 2025

వికారాబాద్: 1.70 లక్షల మందికి రైతు భరోసా

image

రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వికారాబాద్ జిల్లాలో 1.70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.136,48,29,701 జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు ఎకరాల వరకు భూమికి డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల భూమికి రూ.344,665,23,099 జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా మార్చి చివరి నాటికి అర్హులందరికీ సాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News October 29, 2025

సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

image

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్‍‌‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్‌లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.

News October 29, 2025

మణుగూరులో వ్యక్తి సూసైడ్

image

మణుగూరులోని సి-టైప్ గేట్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News October 29, 2025

సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

image

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్‌రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.