News March 31, 2025

వికారాబాద్: 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

image

పదోతరగతి అంటే ఓ మధుర జ్ఞాపకం.. జీవితంలో ఎంత ఎదిగినా సరే టెన్త్ ఫ్రెండ్స్ కలిస్తే చెప్పలేని సంతోషం..ఆ రోజుల్లో చేసిన అల్లరి గుర్తుకొస్తే ఎంతో బాగుంటుంది. VKBజిల్లా ధారూర్ మండలం నాగసమందర్ ZPHSలో 2007-2008 బ్యాచ్‌కు చెందిన టెన్త్ పూర్వ విద్యార్థులు 17ఏళ్ల తర్వాత సోమవారం ఒక చోట కలుసుకున్నారు.యోగ క్షేమాలు తెలుసుకుని, నాటి గురువులను సన్మానించారు. మరి మీరు మీ టెన్త్ ఫ్రెండ్స్‌ను కలిశారా?కామెంట్ చేయండి.  

Similar News

News April 3, 2025

ఏలూరు: జిల్లాలో బుధవారం 5 గురు ఆత్మహత్యలు

image

ఏలూరు జిల్లాలో బుధవారం వివిధ కారణాలతో 5 గురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ముదినేపల్లి మండలం జానకిగూడెంకి చెందిన పిచ్చేటి కొండయ్య(42), పెదవేగి మండలం లక్ష్మీపురంకి చెందిన ఉపేంద్ర(27), పెదపాడు మండలం తోటగూడెంకి చెందిన నార్ని సాంబశివరావు(42), సకలకొత్తపల్లి చెందిన సాకేటి సూర్యారావు(52), గుడిపాడు గ్రామానికి చెందిన నూరు లాజర్ (52) ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో మృతి చెందాడు.

News April 3, 2025

VJA: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2025

ఎమ్మెల్సీగా ప్రమాణం.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగబాబు

image

AP: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు విజయవాడలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు సీఎం చంద్రబాబు, తన సోదరుడు చిరంజీవితో భేటీ అయ్యారు.

error: Content is protected !!