News April 5, 2025

వికారాబాద్: 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు

image

వికారాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు చదవడం, రాయడం సులభంగా నేర్చుకునేందుకు AI తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Similar News

News July 6, 2025

NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

image

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

News July 6, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.8 మి.మీ వర్షపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రఘునాథపాలెం మండలంలో 1.0, ఏన్కూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. ఈ రెండు మండలాలు మినహా గడిచిన 24 గంటల్లో ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

News July 6, 2025

ఐఐఐటీకి తగ్గుతున్న వికారాబాద్ జిల్లా విద్యార్థుల సంఖ్య

image

వికారాబాద్ జిల్లా నుంచి ఐఐఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా బాసరలో అడ్మిషన్లు పొందుతున్నారు. గతేడాది VKB జిల్లా నుంచి 18 మంది ఐఐఐటీకి ఎంపికవగా.. ఈ ఏడాది కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఐఐఐటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.