News March 24, 2025

వికారాబాద్: 26న 148 వాహనాల వేలం

image

వికారాబాద్ జిల్లాలో ఈనెల 26న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గుర్తుతెలియని 148 వాహనాలకు వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SHARE IT.

Similar News

News November 5, 2025

విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

image

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

image

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News November 5, 2025

‘గచ్చిబౌలి దివాకర్‌’లా నారా లోకేశ్‌: YCP

image

AP: మంత్రి లోకేశ్‌పై YCP సెటైర్లు వేసింది. ‘4 గంటల్లో 4 వేల మంది అర్జీలు వినగలమా? గంటకు వెయ్యి అర్జీలేంటో తెలుసుకోవడం సాధ్యమేనా? మరీ ఇంత జాకీలా? మహా అయితే గంటకు 40 మందివి వినగలం. అలాంటిది లోకేశ్ 4 గంటల్లో 4 వేల మంది అర్జీలు తీసుకుని, విన్నట్టుగా ఈ ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్‌’ గుర్తుకువస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది.