News March 9, 2025
వికారాబాద్ TODAY TOP NEWS

✓బొంరాస్ పేట:తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య.✓ పరిగి:ఘనంగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.✓కొట్ పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పెరిగిన సందర్శకులు తాకిడి.✓వికారాబాద్:తొట్ల ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న స్పీకర్.✓వికారాబాద్ జిల్లాలో రెండు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం.✓ మోమిన్ పేట సిఐగా జి.వెంకట్ బాధ్యతలు.✓బొంరాస్ పేట:రోడ్డు తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహం.
Similar News
News November 12, 2025
మొంథా తుఫాన్ నష్టం.. ఉమ్మడి జిల్లాకు నిధుల విడుదల

మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 30న కురిసిన వర్షాలతో వరంగల్, హనుమకొండ నగరాలు జలమయమయ్యాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు సందర్శించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం రూ.12.68 కోట్లు విడుదల చేసింది. పత్తి, వరి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతినగా, రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.
News November 12, 2025
కోనసీమ: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం(M) చెల్లూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తన సొంత నిధులతో ట్రై స్కూటీ అందజేస్తానని గత నెలలో లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరిలో మంగళవారం జరిగిన ప్రజాదర్బార్‌లో ట్రై స్కూటీ అందజేయటంతో వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.
News November 12, 2025
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసి మృతి

ప్రకాశం జిల్లా వాసి జగిత్యాల జిల్లాలో మృతి చెందిన ఘటన మంగళవారం జరింగింది. జిల్లాలోని బీర్పూర్ (M) చిన్నకొల్వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో పడి వలస కూలీ మృతి చెందాడు. కాగా మృతుడు ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంటకి చెందిన రామకృష్ణ(52)గా గుర్తించారు. ఇతనితోపాటు మరికొంతమంది బావిలో ఇసుక పూడిక తీస్తుండగా రామకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందాడు. కాగా బీర్పూర్ SI, పరిశీలించి కేసు నమోదు చేశారు.


