News May 21, 2024

విచారణకు నేను సిద్ధం: లావు కృష్ణదేవరాయలు

image

పల్నాడులో అల్లర్లకు తానే కారణమని YCP నేతలు ఆరోపిస్తున్నారని నరసరావుపేట MP అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ముకేశ్ కుమార్‌కు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. తన కాల్ డేటా పరిశీలించాలని, విచారణకు సిద్ధమని ప్రకటించారు.

Similar News

News September 29, 2024

TDP MLC అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. నేడే అనౌన్స్?

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

News September 29, 2024

గుంటూరు: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News September 28, 2024

టెట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DRO

image

అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్‌లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.