News April 16, 2025
విచారణకు హాజరైన పైలెట్, కోపైలెట్

మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పైలెట్, కోపైలెట్‌ను చెన్నేకొత్తపల్లి పోలీసులు విచారిస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News September 19, 2025
రాజన్న ఆలయానికి రూ.1.21 కోట్లు ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి 29 రోజుల్లో రూ.1.21 కోట్లు ఆదాయం సమకూరింది. గురువారం ఆలయ అధికారులు హుండీలను లెక్కించగా, మొత్తం రూ.1,21,70,150 నగదుతో పాటు 64.900 గ్రాముల బంగారం, 7.300 కిలోల వెండి లభించినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భద్రతను ఎస్‌పీఎఫ్, హోంగార్డు సిబ్బంది పర్యవేక్షించారు.
News September 19, 2025
ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి ఉన్నాయని, వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీరు నిలవకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News September 19, 2025
అల్లూరి: ‘నేషనల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ క్యాంప్’

ఈనెల 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నేషనల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ క్యాంప్ అరకులో జరగనుందని, సంబంధిత శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్యాంప్ 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ వారు నిర్వహిస్తున్నారన్నారని తెలిపారు.ఈ క్యాంప్‌కి పలు రాష్ట్రాల నుండి 565 ఎన్‌సీసీ క్యాడేట్లు రానున్నారని పేర్కొన్నారు.