News April 17, 2025
విచారణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: భూపాలపల్లి కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు విచారణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని భూపాలపల్లి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ ప్రక్రియపై గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో మొత్తం 51,723 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు: పశు సంవర్ధక శాఖ

AP: రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు వివరించారు. పల్నాడులో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతిచెందిన ప్రాంతంలో 70మంది శాంపిల్స్ పరీక్షించగా నెగటివ్ వచ్చిందని చెప్పారు.
News April 19, 2025
NZB: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..

నిజామాబాదు లో గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని మార్చురికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.
News April 19, 2025
ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.