News September 5, 2025
విచిత్ర దొంగతనం.. చికెన్ సెంటర్లో 4 కత్తులు చోరీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విచిత్ర దొంగతనం జరిగింది. SI రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సల్వాజీ వెంకటసాయి నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లోకి గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చొరబడి రూ.2వేలు విలువచేసే నాలుగు కత్తులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News September 7, 2025
ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.
News September 7, 2025
జగిత్యాల: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

జగిత్యాల(D) మల్లాపూర్(M) ముత్యంపేటలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయలు పేలుస్తుండగా చిట్యాల అరవింద్ అనే యువకుడి కంట్లోకి ఒక టపాకాయ దూసుకెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేల్చుతున్నప్పుడు ఒకటి పేలకపోవడంతో దాన్ని పరిశీలించడానికి దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో టపాకాయ పేలి అందులోని నిప్పురవ్వ నేరుగా అతని కంట్లోకి దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని నిజామాబాద్‌కు తరలించారు.
News September 7, 2025
నిర్మల్: గోదావరిలో మనిషి దంతాలను పోలిన చేపలు..!

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ అనే వ్యక్తి ఆదివారం బాసర గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. నదిలో చేపలు పడుతున్న క్రమంలో సంతోష్‌కు మనిషి దంతాలు పోలిన ఓ చేప దొరికింది. ఈ అరుదైన చేపను చూసి ప్రజలు వింతగా ఉందని ఆశ్చర్యపోయారు. చేప బరువు కేజీన్నర ఉందని తెలిపారు. కాగా చేప పేరు తెలీదని, మిగితా జాలర్ల వలలకు కూడా ఇలాంటి చేపలు చిక్కాయని సంతోష్ తెలిపారు.