News September 12, 2025
విజయదశమి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలకు తావులేకుండా పండుగ జరపడంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
Similar News
News September 12, 2025
హైదరాబాద్: ఇది కదా.. రాజకీయం అంటే!

మీరు పార్టీ మారారు అని BRS కోర్టు మెట్లెక్కితే.. మేమెక్కడ మారాం.. కేవలం అభివృద్ధి పనుల కోసమే CMను కలిశాం అని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. శేరిలింగంపల్లి MLA గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తాము పార్టీ మారలేదని స్పీకర్‌కు సమాధానమిచ్చారు. అంటే.. నాయకులకు పార్టీ కంటే పదవే ముఖ్యమని, పదవి ఉంటుందంటే ఏ పార్టీలో అయినా ఉంటారనే కదా దీనర్థం. ఇదికదా రాజకీయం అంటే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 12, 2025
బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు పెట్టాం: కొవ్వూరు సీఐ

కొవ్వూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన దాసరి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాలికను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News September 12, 2025
HYD: ట్రాఫిక్ సమస్యకు ఐడియా చెప్పండి

నగరంలో బండిపై బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ట్రాఫిక్ ఎప్పుడు.. ఎక్కడ జామ్ అవుతుందో అర్థం కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18, 19 తేదీలలో నెక్లెస్ రోడ్డులో ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చిస్తామని, మంచి ఐడియా చెప్పాలని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.