News August 20, 2025

విజయనగరంలో గంజాయితో ఇద్దరు అరెస్టు

image

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్ గంట, అంతరామి మల్లిక్‌ను విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా 10 కేజీల గంజాయితో పట్టుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అనంతరం గంజాయి సీజ్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News April 5, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 5, 2026

SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

image

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.

SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.

News April 5, 2026

గుంటూరులో ఓపెన్ డ్రింకింగ్‌.. 179 మందిపై కేసులు

image

గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం తాగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. SP వకుల్ జిందాల్ ఆదేశాలతో నిన్న సాయంత్రం 5:30 నుంచి 9గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 178 కేసులు నమోదు చేసి, 179 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 8 FIR కేసులు, 170 పెట్టి కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని పోలీసులు సూచించారు.