News October 9, 2024

విజయనగరంలో నేడు డయల్ యువర్ MP కార్యక్రమం

image

విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై భక్తులు సలహాలు సూచనలు అందించాలని కోరారు. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు: 9440436426, MP క్యాంప్ ఆఫీస్: 8919060911, మున్సిపల్ కమిషనర్, విజయనగరం: 9849906486 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News October 1, 2025

VZM: పీ4 కార్యక్రమంపై చంద్రబాబు ఏమన్నారంటే..!

image

పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఆయన ప్రశాంగించారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. ప్రజల బాగోగుల కోసం నిర్దిష్టమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

News October 1, 2025

చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తా: దత్తిలో సీఎం

image

సంక్షేమమే కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని CM చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఆయన మాట్లాడారు. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే తను పనిచేస్తానన్నారు. ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని, రహదారులను కూడా బాగు చేస్తున్నామని అన్నారు.

News October 1, 2025

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం: సీఎం చంద్రబాబు

image

ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని, 2026 ఆగస్టుకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.