News October 3, 2025
విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901439>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళుతుండగా వద్దని అమ్మ వారించారు. పంతానికి పోయి యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విన్న పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి కలలో కనిపించి చెరువులో విగ్రహామై వెలసి ఉన్నానని చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా పిలవబడుతుంది.
Similar News
News October 3, 2025
సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.
News October 3, 2025
ప్రాక్టికల్స్ కోసం వెళ్లి MBBS విద్యార్థిని సూసైడ్

నెల్లూరు మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో శుక్రవారం ఉదయం MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని <<17902198>>ఆత్మహత్య <<>>చేసుకుంది. మృతురాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరుకు చెందిన సంజీవ రాయుడు, లక్ష్మీదేవి కుమార్తె బన్నెల గీతాంజలిగా గుర్తించారు. ఇటీవల ఊరికి వచ్చిన ఆమె.. ప్రాక్టికల్స్ ఉండటంతో నిన్న కాలేజీకి వెళ్లింది. ఇవాళ ఆత్మహత్య చేసుకుంది.
News October 3, 2025
NLG: మద్యం టెండర్‌లకు మందకొడిగా దరఖాస్తులు..!

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.