News November 3, 2024

విజయనగరంలో ప్రజా ప్రతినిధుల సంఖ్య ఇలా..

image

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీ గుర్తులతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో MPTC 549, ZPTC 34, కార్పొరేటర్లు 50, కౌన్సిలర్లు 110, MLA 9, MLC ఒకరు చొప్పున మొత్తం 753 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాగా వీటిలో మొత్తం 22 ఖాళీలు ఏర్పడ్డాయి. మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు.

Similar News

News September 30, 2025

ఎస్.కోట: చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

image

తన చదువుకి తగ్గ సరైన ఉద్యోగం దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ నరసింహమూర్తి వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్ హైదరాబాదులో ఓ నెట్వర్క్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సొంత గ్రామం కొత్తూరుకు 28న వచ్చాడు. 29న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తండ్రి బాపు నాయుడు ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News September 30, 2025

విజయనగరం కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన

image

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నేతలు పాల్గొన్నారు.

News September 30, 2025

హోంమంత్రి అనితతో పైడితల్లమ్మ దేవస్థాన ఈఓ భేటీ

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్, హోం మంత్రి వంగలపూడి అనితను విజయనగరం శ్రీపైడితల్లి దేవస్థానం ఈవో, సహాయ కమిషనర్ శిరీష విశాఖలోని హోం మంత్రి ఆఫీసులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 7న జరగనున్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీపైడితల్లమ్మ సినిమానోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను అనితకు వివరించారు.