News December 30, 2024
విజయనగరంలో ప్రారంభమైన కానిస్టేబుల్ పీఈటీ టెస్టులు
పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విజయనగరం పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఎంపికలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్నింగ్, లాంగ్ జంప్, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన వారికి త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కోరారు.
Similar News
News January 2, 2025
VZM: వాలీబాల్ ప్లేయర్స్ గెట్ రెఢీ..!
జనవరి 5న ఆదివారం ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ బాలురు వాలీబాల్ జట్టు ఎంపిక జరుగుతుందని వాలీబాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కేవీఏఎన్ రాజు గురువారం తెలిపారు. క్రీడాకారులందరూ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో హాజరవ్వాలన్నారు. ఎంపికైన క్రీడాకారులను త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.
News January 2, 2025
ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ జి.ధర్మారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ఎంవీపీ కాలనీలో ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
News January 2, 2025
ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాల జోరు
విజయనగరం ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 31న రూ.5.99 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లాలో 5,786 కేసుల లిక్కర్, 2,012 కేసుల బీర్లు కలిపి మొత్తం రూ. 4.30 కోట్లు, పార్వతీపురం జిల్లాలో 2,324 కేసుల లిక్కర్, 678 కేసుల బీర్లు కలిపి మొత్తం రూ.1.69 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు.