News October 6, 2025

విజయనగరంలో మద్యం దుకాణాలు బంద్

image

శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా విజయనగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. పట్టణంలో ఉన్న మొత్తం 14 మద్యం దుకాణాలతో పాటు 12 బార్లను నిన్న రాత్రి నుంచి అధికారులు మూసివేశారు. అలాగే జొన్నవలస, సుంకరిపేట, బియ్యాలపేటలో ఉన్న షాపులు కూడా మూతపడ్డాయి. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి షాపులు పునఃప్రారంభం కానున్నాయని సీఐ మన్మథరావు తెలిపారు.

Similar News

News October 6, 2025

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరో

image

‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన నటించిన డ్యూడ్, lik(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఈ నెల 17న రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ తరం హీరోల్లో ‘నాని’ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయనున్న హీరోగా ప్రదీప్ రికార్డులకెక్కనున్నారు. గతంలో నాని ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలు ఒకే రోజు(2015 మార్చి 21) థియేటర్లలో రిలీజయ్యాయి.

News October 6, 2025

శాంతించిన వంశధార..!

image

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.

News October 6, 2025

స్పిరిట్, లేబుల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?

image

ములకలచెరువుకు స్పిరిట్ సరఫరా ఎక్కడ నుంచి సరపరా అయిందనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏపీలో పట్టుబడ్డ రెండు, మూడు కేసుల్లో హైదరాబాద్ నుంచి ఓ డిస్లరీ కంపెనీ నుంచి సరఫరా అయినట్లు సమాచారం. అదే కంపెనీ నుంచి స్పిరిట్ సరఫరా చేశారా? లేక బెంగళూరు నుంచి వచ్చిందా అనే కోణంలో పోలీసుల విచారిస్తున్నట్లు సమాచారం. ఇక నకిలీ లేబుల్‌లు ఎక్కడ ముద్రించారనే ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి.