News August 7, 2024
విజయనగరంలో ముగిసిన అవగాహన సదస్సు
ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్వహించిన మూడు రోజుల అవగాహన సదస్సు బుధవారంతో ముగిశాయి. పరిశ్రమల స్థాపనకు రాయతీ రుణాలు ఎలా పొందాలో జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వంశీ మోహన్ అవగాహన కల్పించారు. లోన్లు ఎలా పొందాలో కెనరా బ్యాంకు ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2024
IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ
రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
News November 25, 2024
VZM: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు
కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.
News November 25, 2024
గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం: మంత్రి
గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు సాలూరు మండలం కారాడవలస గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం వైద్యాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కంటైనర్ ఆసుపత్రుల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.