News October 15, 2024

విజయనగరంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూం

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్ఈ, ఈఈలను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే టోల్ ఫ్రీ నెం. 1912 లేదా కంట్రోల్ రూమ్ నెం. 94906 10102 తెలియజేయాలన్నారు.

Similar News

News October 14, 2024

సిరిమానోత్సవంలో చీకటికి చెక్..!

image

విజయనగరంలో మంగళవారం జరగబోవు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చీకటికి చెక్ పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా జనరేటర్ సహాయంతో వెలిగే విద్యుత్ లైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News October 14, 2024

ఘనంగా పైడితల్లి తొలేళ్ల సంబరం

image

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తొలేళ్ల సంబ‌రం సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఊరంతా పండ‌గ శోభ‌ను సంత‌రించుకుంది. పులివేషాలు, క‌ర్ర‌సాము, క‌త్తిసాము, వివిధ వేషాలతో ప‌ట్ట‌ణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో ప‌ట్ట‌ణం మారుమోగింది. వివిధ ప్రాంతాల‌ నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తులు తరలివస్తున్నారు.

News October 14, 2024

నేడు పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

image

భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది. రేపు సిరిమానోత్సవం జరగనుండగా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు, రేపు విజయనగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీఐ మన్మథరావు తెలిపారు.