News November 21, 2024

విజయనగరంలో సయ్యద్ ముక్తర్ అలీ టోర్నీ

image

విశాఖతో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఈనెల 23 నుంచి సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అస్సాం, ఒడిశా, పాండిచ్చేరి, చత్తీస్‌గఢ్, విదర్భ, రైల్వేస్ జట్లు పోటీ పడనున్నాయని అన్నారు. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లలో పాల్గొంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

Similar News

News November 21, 2024

5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

image

5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖ ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

News November 21, 2024

విజయనగరంలో పెరుగుతున్న చలి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను చలి వణికిస్తోంది. శృంగవరపుకోట మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత పెరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరి శిఖర ప్రాంతాల్లో వాతావరణం కూల్‌గా ఉంటోంది. మైదాన ప్రాంతాల్లో గడిచిన ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గతేడాది పోలిస్తే ఈ సమయానికి చలి తక్కువేనని ప్రజలు చెబుతున్నారు.

News November 20, 2024

పర్యాటక ప్రాంతంగా రామతీర్థం..?

image

ఉత్తరాంధ్రలోనే అతి ప్రధాన దేవాలయంగా రామతీర్థం విరాజిల్లుతోంది. బోడికొండ, దుర్గా భైరవకొండ, గురు భక్తుల కొండలు ఇక్కడ ఉన్నాయి. పాండవులు, బౌద్ధులు సంచరించే ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనలో భాగంగా రామతీర్థం పేరును కలెక్టర్ అంబేద్కర్ ప్రకటించారు. తీర్థయాత్ర పర్యాటక ప్రాంతంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.