News October 8, 2024

విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన

image

అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Similar News

News October 8, 2024

VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్‌పూర్ పాసింజర్లు

image

విశాఖ-రాయపూర్, విశాఖ-కోరాపుట్ లింక్ చేసిన విషయం విదితమే. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా లింకును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ గతంలో వచ్చిన మాదిరిగానే విశాఖపట్నంలో వేకువజామును 4.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖ-కొరాపుట్ పాసింజర్ విశాఖలో ఉదయం 6:30కి బయలుదేరుతుంది. ఈనెల 20 నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తారు. >Share it

News October 8, 2024

విజయనగరం: మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ

image

విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తుల తాకిడి పెరిగింది. జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా, వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 1,689 దరఖాస్తులు పడ్డాయి. ఆ విధంగా దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రేపు సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో ఈ రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు పడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

News October 8, 2024

విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాలకు స్పెషల్ ట్రైన్

image

విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాల సందర్భంగా విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ నెల 10 నుంచి 16 వరకు 08529 నంబరుతో విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు, 08530 శ్రీకాకుళం రోడ్డు- విశాఖపట్నం నడవనుంది. ప్రతి రోజు విశాఖలో ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమై 3.55కి విశాఖ చేరుకుంటుంది. >Share it