News March 8, 2025
విజయనగరంలో 3వేల మంది మహిళలతో ర్యాలీ: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 9, 2025
VZM: రేపటి నుంచి PGRS ప్రారంభం

సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PVGR) కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గత కొన్ని వారాలుగా పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలన్నారు.
News March 9, 2025
విజయనగరంలో ముగ్గురు కార్యదర్శులు సస్పెన్షన్

విజయనగరం నగర పాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బులు సకాలంలో నగర పాలక సంస్థకు జమ చేయని ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ పి.నల్లనయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను వసూలు చేసి సకాలంలో జమ చేయడం లేదని గుర్తించి పన్ను డబ్బులు జమ చేపించి సస్పెండ్ చేశామన్నారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 9, 2025
రాజాం: వాల్ పిన్ మింగేసిన బాలుడు

ఏడాది వయసున్న బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. బాలుడు ఏడుస్తూ అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఓ హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న వాల్ పిన్ జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.