News October 22, 2024
విజయనగరంలో TODAYS TOP NEWS

>గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన > చెత్త వాహనంలో తరలించిన వెల్ల ఏనుగుకు సంప్రోక్షణ >ప్రభుత్వ పనితీరు, జమిలీ ఎన్నికలపై మండిపడ్డ శాసన మండలి విపక్షనేత బొత్స >పెద్ద చెరువులో పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయిల్ రన్ >దివ్యాంగురాలి కోసం కాన్వాయ్ ఆపించిన పవన్ >తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు మండలాల వారిగా కలెక్టర్ యాక్షన్ ప్లాన్.
Similar News
News February 6, 2026
విజయనగరం రైల్వే స్టేషన్‌లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం

విజయనగరం రైల్వే స్టేషన్‌లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కన్ఫర్మ్ అయిన పీఎన్‌ఆర్ ఉన్న ప్రయాణికులకే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. బుకింగ్స్ అన్నీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుందన్నారు.
News February 6, 2026
విజయనగరంలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

విజయనగరం, పార్వతీపురం మన్యం డివిజన్ల పరిధిలోని సీతానగరం, కురుపాం, పెదబొండపల్లి, భీమసింగి, భోగాపురం తదితర 66 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 6, 2026
VZM: ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ పర్యటన

ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయనగరం చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పత్రికా సమావేశం, 2:30లకు NDA నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి విశాఖకు వెళ్తారని జిల్లా సమాచార శాఖ గురువారం తెలిపింది.


