News April 10, 2024
విజయనగరం: అత్తారింటికి వెళ్తూ మృతి

పండగ పూట అత్తారింటికి వెళ్తూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బలిజిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగాపురం గ్రామానికి చెందిన ఎస్.సంగమెశ్ (24) మంగళవారం మిర్తివలస అత్తవారింటికి వెళ్తుండగా బైక్‌ని, లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయలైన సంగమేశ్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.
Similar News
News October 5, 2025
ఉత్సవ వేదికలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

విజయనగర ఉత్సవ వేదికలను కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఏఎస్పీ సౌమ్యలతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
News October 5, 2025
ఈ నెల 6న గ్రీవెన్స్ ఉండదు: కలెక్టర్

ఈనెల 6 వ తేదీన (సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఆరోజు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, విజయనగరం ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రకటించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.
News October 4, 2025
VZM: డ్వాక్రా బజారులో రూ.12 కోట్ల వ్యాపారం

ఈ ఏడాది విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేష స్పందన వస్తోందని డీఆర్డీఏ పధక సంచాలకులు శ్రీనివాస్ పాణి అన్నారు. శుక్రవారం డ్వాక్రా బజారును పరిశీలించారు. గత ఏడాది రూ.8కోట్ల అమ్మకాలు జరగగా, ఈ సారి రూ. 12 కోట్ల వరకు అమ్మకాలు సాగే అవకాశం ఉందన్నారు. ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళ సంఘాలు పాల్గొన్నాయన్నారు.