News March 24, 2024
విజయనగరం: ఆ రెండు స్థానాల్లో వీడని ఉత్కంఠ..!

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.
Similar News
News February 24, 2026
VZM: పీఎం శ్రీ పాఠశాలల తనిఖీకి కేంద్ర నోడల్ అధికారి

పీఎం శ్రీ పాఠశాలల అమలును పరిశీలించేందుకు జిల్లాకు కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నీరజ్ కుమార్ గయాగిని నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని మంగళవారం కలిశారు. విజయనగరం జిల్లాలో 37 పీఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ఈ పథకం లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. 2022-24 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.60 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
మైనర్ డ్రైవింగ్‌కు స్వస్తి పలకాలి: VZM SP

మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ప్రమాదాలు పెరుగుతాయని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. 18 ఏళ్ల లోపు వారికి డ్రైవింగ్ అర్హత లేదని, అనుభవం లేకపోవడం వల్ల రహదారి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులు, వాహన యజమానులే చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 24, 2026
VZM: మార్చి 8న గురుకుల పాఠశాల్లో ప్రవేశ పరీక్ష

విద్యా సంవత్సరంలో ఏపీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 6-10వ తరగతులకు మార్చి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ ఎం.మాణిక్యం తెలిపారు. 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్ష యధావిధిగా మార్చి1న జరుగుతుందన్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్‌టు పరీక్షలు ఉన్న కారణంగా 6, 7, 8, 9, 10వ తరగతులకు మార్చి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు ప్రకటించారు.


