News February 26, 2026
విజయనగరం: ఇద్దరి మరణానికి కారణమైన లారీ.. ఛత్తీస్‌గఢ్‌లో లభ్యం

రామభద్రపురం వద్ద జనవరి 25న ఇద్దరి మరణానికి కారణమైన లారీని ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు ఎట్టకేలకు పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్వస్తిక్ మినరల్స్ లారీగా తేలింది. డ్రైవర్ చోటిలాల్ ప్రమాదం తర్వాత లారీని కంపెనీకి అప్పగించి మధ్యప్రదేశ్ పారిపోయాడు. నిశిత విచారణతో పోలీసులు లారీని ఛత్తీస్‌గఢ్ నుంచి స్టేషన్‌కు తరలించారు.
Similar News
News February 28, 2026
BREAKING.. నస్రుల్లాబాద్: కాలేజ్ భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
News February 28, 2026
అమీన్పూర్: కోకాపేట్ శారదా పీఠం వద్ద ఉద్రిక్తత: హరీశ్ రావు

కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారదా పీఠం ఖాళీ చేయించేందుకు అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకుని ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. గతంలో కేటాయించిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ నేతలు పీఠానికి సంఘీభావం తెలిపి, ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
News February 28, 2026
సదాశివపేట: ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. 14 మందికి గాయాలు

సదాశివపేట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సీఐ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


