News October 11, 2024

విజయనగరం ఉత్సవాల్లో ఈవెంట్స్ జరిగే ప్రాంతాలివే..

image

విజయనగరం-2024 ఉత్సవాలను ఆదివారం ఉ.11 గంటలకు అయోధ్య మైదానంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వేదికలు: అయోధ్య మైదానం, మహారాజ కోట, గురజాడ కళాక్షేత్రం, విజ్జీ స్టేడియం, రాజీవ్ స్టేడియం, ఆనంద గజపతి కళాక్షేత్రం, ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్, లయన్స్ కమ్యూనిటీ హాల్, బొంకుల దిబ్బ, కోట, మన్సాస్ మైదానం(లోవర్ ట్యాంక్ బండ్ రోడ్).

Similar News

News October 12, 2024

విజయనగరం: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన

image

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని విజయనగరం రూరల్ మండలం గోపాలపురం వద్ద అందుబాటులో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. దీంతో జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

News October 11, 2024

సిరిమానోత్సవంపై కలెక్టర్ సమీక్ష

image

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అన్ని సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో అమ్మవారి పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమ్మవారి సిరిమాను వద్ద పని చేసే సిబ్బంది 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ప్రారంభం అయ్యేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 5 గంటలలోగా జాతర పూర్తవ్వాలన్నారు.

News October 11, 2024

VZM: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ‘1912’

image

విజయనగరం జిల్లాలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఇంటి వద్ద నుండే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘1912’ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి రైతు యొక్క ఆధార్, పాస్ బుక్, సర్వే నంబర్, ఫామ్ -3, మొబైల్ నంబర్ వివరాలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలపాలన్నారు.