News August 21, 2024

విజయనగరం: ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం గ్రామ సభలు

image

ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం ప్రతి గ్రామంలో ఈ నెల 23 న గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ గ్రామ సభల్లో సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయం చేసుకొని ప్రణాళికా బద్దంగా సభలను విజయవంతం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ ఎం.పి.డి.ఓ లు, ఈఓఆర్డిలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సభలపై ఆయన పలు సూచనలు చేశారు.

Similar News

News October 1, 2025

సీఎం పర్యటన.. 600 మందితో బందోబస్తు: VZM SP

image

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2025

సీఎం చంద్రబాబు టూర్ టైమింగ్స్ ఇవే..

image

➤ఉదయం 11:10 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు
➤ఉదయం 11:20కి హెలీకాప్టర్‌లో స్టార్ట్ ➤ఉదయం 11:30కి దత్తి హెలీప్యాడ్‌కు చేరిక
➤11:40 వరకు ప్రముఖుల ఆహ్వానం ➤11:50కి దత్తి గ్రామానికి రోడ్డు మార్గంలో చేరిక
➤11:50 నుంచి మ.12:05 వరకు డోర్ టూ డోర్ పింఛన్ల పంపిణీ
➤12:10కు ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు ➤ మధ్యాహ్నం 2:10 వరకు ప్రజా వేదిక వద్ద
➤2:15కి పార్టీ కేడర్‌తో మీటింగ్ ➤సా.4 గంటలకు తిరుగు ప్రయాణం

News September 30, 2025

సీఎం పర్యటన.. 600 మంది బందోబస్తు: VZM SP

image

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.