News April 19, 2024
విజయనగరం: ఊపందుకున్న నామినేషన్లు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు విజయనగరం ఎంపీ స్థానానికి 6, అసెంబ్లీ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం-4, గజపతినగరం-8, చీపురుపల్లి-3, ఎస్.కోట-4, నెల్లిమర్ల-6, బొబ్బిలి-6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అటు మన్యం జిల్లాలో అరకు ఎంపీ స్థానానికి 4, కురుపాం-1, సాలూరు-2, పార్వతీపురం-2 నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News April 21, 2025
VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.