News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

Similar News

News July 8, 2024

విజయనగరంలో ఈ నెల 11న జాబ్‌మేళా: అరుణ

image

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా, వివిధ ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 270 ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త‌మ వివరాలను ముందుగా employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 11న ఉదయం 10 గంటలకు విజయనగరం శ్రీ చైతన్య డిగ్రీ క‌ళాశాల‌లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

News July 8, 2024

పార్వతీపురం: ‘నాణ్యమైన ఆహారం అందించాలి’

image

వసతి గృహాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సాయి నగర్ కాలనీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజే ఆశ్రమ పాఠశాల నిర్వహణపై దృష్టి సారించారు. విద్యార్థులకు వండిన వంటకాలను రుచి చూశారు.