News April 19, 2024

విజయనగరం: కడుపునొప్పి తాళలేక యువకుడి మృతి

image

కడుపునొప్పి తాళలేక బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన తూముల విజయకుమార్(23) గత మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితం విరక్తిచెంది గ్రామ సమీపంలో అరటితోట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్సకోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జయంతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 1, 2025

ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్: VZM SP

image

ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదు బృందాలుగా 30 మంది నిత్యం పహారా కాస్తున్నారని పేర్కొన్నారు.

News August 31, 2025

VZM: గౌరవ వందనం స్వీకరించిన అశోక్ గజపతిరాజు

image

గోవా గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.

News August 31, 2025

VZM: నేడు జిల్లాకి రానున్న గోవా గవర్నర్

image

గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్‌ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.