News April 26, 2024

విజయనగరం: కాంగ్రెస్ అభ్యర్థి.. విమానం గుర్తు..! (REWIND)

image

చీపురుపల్లి నియోజకవర్గానికి 1985లో జరిగిన ఎన్నికల్లో వింత ఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీసాల నీలకంఠం నాయుడికి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బీఫాం కొంత ఆలస్యంగా రావడంతో సకాలంలో నామినేషన్ వేయలేకపోయారు. ఆయనను EC స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి విమానం గుర్తుఇచ్చింది. దీంతో ఆయన విమానం, హస్తం గుర్తులను బ్యానర్‌పై వేయించి ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

Similar News

News September 30, 2024

బొబ్బిలిలో సినీ నటుడు సాయికుమార్

image

బొబ్బిలిలోని స్థానిక హోటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో సాయికుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే తమ బంగారు భవిష్యత్ శూన్యమవుతుందని సూచించారు.

News September 30, 2024

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మన విజయనగరంలో..

image

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరంలో ఏర్పాటు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన 12వేల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య లక్ష వరకు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కేంద్రం రామాయణంపై పరిశోధనలకు, మానవత్వ విలువలను భావితరాలకు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.

News September 30, 2024

కురుపాంలో రోడ్డు ప్రమాద ఘటనలో UPDATE

image

కురుపాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీలకంఠరావు వివరాలు.. దొంబిడిలోని పాస్టర్ దుర్గారావు, భార్యతో కలిసి బైకుపై ప్రార్థనకు వెళ్తున్నారు. బి.శ్రీను, అతని స్నేహితుడికి ప్రకృతి అందాలు చూపించేందు బైకుపై వచ్చాడు. వారి ఇరువురి బైకులు ఎదురుగా వచ్చి బల్లేరుగూడ వద్ద ఢీకొన్నాయి. ఘటనలో శ్రీను, దుర్గారావు మృతి చెందారు.ఘటనపై SI కేసు నమోదు చేశామన్నారు.