News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
Similar News
News September 27, 2025
VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 4, విజయనగరంలో 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.
News September 27, 2025
పొక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: SP

పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నానికి చెందిన అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ శుక్రవారం తెలిపారు. 7 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం మంజూరైందన్నారు.
News September 27, 2025
నేడే అమృత్ భారత్ రైలు ప్రారంభం.. ఉమ్మడి జిల్లాలో స్వాగత ఏర్పాట్లు

బ్రహ్మాపూర్–సూరత్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్(09022) సేవలు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ శనివారం ఉదయం 10.45కి VC ద్వారా ప్రారంభించనున్నారు.
➤విజయనగరం మధ్యాహ్నం 3.40కి చేరుకోగా.. సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది
➤బొబ్బిలికి సాయంత్రం 4.45కి చేరుకొని 4.55కి బయలుదేరుతుంది
➤పార్వతీపురం 5:15కి చేరుకొని 5.25కి బయలుదేరుతుంది
ఆయా స్టేషన్లలో అధికారులు స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశారు.