News April 2, 2024
విజయనగరం: జనసేనలో చేరిన వాలంటీర్

విజయనగరం నియోజకవర్గంలో 37వ డివిజన్ స్థానిక బీసీ కాలనీలో వాలంటీర్‌గా పని చేస్తున్న గోక చక్రధార్ జనసేనలో చేరాడు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేననీ మరింత బలోతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు.
Similar News
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.