News October 12, 2025
విజయనగరం జిల్లాలో నేటి ప్రధాన వార్తలు

➤శ్రీ పైడిమాంబ తెప్పోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు, రేపు ట్రయిల్ రన్
➤కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న చిన్న శ్రీను
➤విజయనగరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశం
➤మంత్రి లోకేశ్‌తో కిమిడి నాగార్జున భేటీ
➤క్షత్రీయుల సంక్షేమానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు
➤టీడీపీ నూతన కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే అదితి
➤కొత్తవలసలో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి
Similar News
News October 13, 2025
కలెక్టరేట్లో నేడు PGRS: VZM కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 13న ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. అర్జీదారులు తమ వివరాలతో పాటు పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు.
News October 12, 2025
మంత్రి లోకేశ్ సమీక్షలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 12, 2025
VZM: ‘రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో ఇంజినీర్ల పాత్ర, సిబ్బంది సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, బదిలీలు, సేవా పరిరక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని మహంతి పేర్కొన్నారు.