News July 5, 2025
విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
Similar News
News July 5, 2025
రైలు నుంచి జారిపడి యువతి మృతి

రైలు నుంచి జారిపడి యువతి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి నల్గొండలో జరిగింది. HYD బోయిన్ పల్లికి చెందిన పీఎన్ రిత్విక (18) చెన్నై ఎక్స్ ప్రెస్ రైలులో చర్లపల్లి నుంచి చెన్నై వెళ్తుంది. నల్గొండ స్టేషన్‌లో వాటర్ బాటిల్ కొనుక్కొని ఎక్కుతుండగా ట్రైన్ కదిలింది. రన్నింగ్‌లో ఎక్కేందుకు యత్నించగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. రైల్వే ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 5, 2025
ఇవాళ టీమ్ ఇండియాకు కీలకం

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్‌కు ఇవాళ(4వ రోజు) కీలకం కానుంది. తొలి టెస్టులో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ముఖ్యంగా నేటి మార్నింగ్ సెషన్‌లో వికెట్లు పడకుండా ఆడాలి. రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులకు ఒక వికెట్ కోల్పోగా క్రీజులో రాహుల్, నాయర్ ఉన్నారు. వీరు నిలదొక్కుకొని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. ప్రస్తుతం 244 రన్స్ లీడ్‌లో ఉండగా దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లాలి.
News July 5, 2025
ముమ్మిడివరం: బైపాస్ రోడ్డు వద్ద కాలువలో మృతదేహం

ముమ్మిడివరం కాశివాని తూము సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. నిక్కరు షర్టు వేసుకుని సుమారు 50 సంవత్సరాలు పైబడిన పురుషుని మృతదేహంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.