News July 31, 2024

విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్..

image

నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన మత్స దివ్య అనే 27 ఏళ్ల మహిళ ఆచూకీ నెల రోజుల నుంచి దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సదరు మహిళ మానసిక సమస్యతో బయటకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లేదా 9963111089 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News September 16, 2025

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 ల‌క్ష్యం: VZM జేసీ

image

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌ ల‌క్ష్య‌మ‌ని జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శులు బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా కృషి చేయాల‌ని కోరారు. పీ-4 కార్య‌క్ర‌మం, బంగారు కుటుంబాలు, మార్గ‌ద‌ర్శుల పాత్ర‌పై స‌చివాల‌యం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

News September 16, 2025

VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.

News September 16, 2025

VZM: మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు వ‌రం

image

మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు స్వ‌స్త్ నారీ స‌శ‌క్తి ప‌రివార్ అభియాన్ ప‌థ‌కం ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వన్ అన్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి గోడ ప‌త్రిక‌ను ఆయ‌న క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం ఆవిష్క‌రించారు. దీని ద్వారా వివిధ ర‌కాల స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన‌వారికి త‌గిన వైద్య స‌దుపాయాన్ని అందించాల‌ని సూచించారు.