News March 26, 2025

‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

image

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.

Similar News

News March 29, 2025

అనుమానస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.

News March 29, 2025

ఈ నెల 31న గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్ అంబేద్కర్

image

ఈ నెల 31వ తేదీన సోమ‌వారం రంజాన్ పండుగ సంద‌ర్భంగా, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వ‌హించే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌వేదిక కార్యక్రమాన్ని ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ఆయ‌న సూచించారు. ఆ రోజున మండల కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్ ఉండదన్నారు.

News March 29, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: VZM SP

image

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన నిందితుడు కంది సన్యాసిరావు(19)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం తెలిపారు. రూ.10,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.

error: Content is protected !!