News January 5, 2026
విజయనగరం జిల్లాలో రేపు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. గంట్యాడ మండలం రాచకిండాంలో వరి పొలాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తదుపరి బొండపల్లి మండలంలోని రైతు సేవా కేంద్రం, రైస్ మిల్లును సందర్శిస్తారు. మధ్యాహ్నం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం డెంకాడ, భోగాపురం మండలాల్లో రైతు సేవా కేంద్రాలు, పొలాలు, ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేస్తారు.
Similar News
News February 18, 2026
VZM: సామాన్యులకు రూ.60 లక్షల ప్రమాద బీమా

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.
News February 18, 2026
VZM: సామాన్యులకు SBI రూ.60 లక్షల ప్రమాద భీమా

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.
News February 18, 2026
VZM SP కీలక హెచ్చరికలు

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్‌లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్‌లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.