News March 17, 2025
విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News February 26, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 26, 2026
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.
News February 26, 2026
VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.


