News May 24, 2024

విజయనగరం: తొలిరోజు పరీక్ష.. 729 మంది గైర్హాజరు: DEO

image

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు జిల్లా మొత్తంగా 1218 విద్యార్థులకు గాను 489 మంది హాజరయ్యారు. 729 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. 

Similar News

News September 30, 2024

విజయనగరం ఉత్సవాల్లో 12 చోట్ల వినోద కార్యక్రమాలు

image

అక్టోబర్ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో 12 ప్రధాన వేదికల వద్ద వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. వేదికల వద్ద జిల్లా అధికారులను ఇన్ ఛార్జ్‌లుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమాల పట్ల వారి ఆసక్తి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్ మెంబర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.

News September 30, 2024

లేజ‌ర్ షో ద్వారా విజయనగరం చరిత్ర

image

కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కోట చుట్టూ వున్న కంద‌కాల‌ను స్వ‌చ్ఛ‌మైన నీటితో నింపి లాన్‌తో అందంగా తీర్చిదిద్దాల‌న్నారు. కోట గోడ‌ను ఆనుకొని వెన‌క‌వైపు ఉన్న ఖాళీ స్థ‌లంలో సంద‌ర్శ‌కులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కోట‌కు ద‌క్షిణం వైపు ప్ర‌తిరోజూ లైట్ అండ్ షో నిర్వ‌హించి విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌, వైభ‌వాన్ని లేజ‌ర్ షో ప్రదర్శిస్తారు.

News September 30, 2024

బొబ్బిలిలో సినీ నటుడు సాయికుమార్

image

బొబ్బిలిలోని స్థానిక హోటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో సాయికుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే తమ బంగారు భవిష్యత్ శూన్యమవుతుందని సూచించారు.