News March 21, 2024

విజయనగరం: నీళ్ల ట్యాంకులో పడి బాలుడు మృతి

image

తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోడానికి వెళ్లిన దాసరి సిద్దు(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు స్నానాలు చేసే నీళ్ల ట్యాంకులో పడి మృతి చెందిన సంఘటన భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన దాసరి నరసింహారావు భార్యాబిడ్డలతో కూలి పనుల కోసం భోగాపురం వచ్చారు. వారు పనులు చేస్తుండగా కుమారుడు ఆడుకోవడానికి వెళ్లి ట్యాంక్‌లో పడి చనిపోయాడని వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 5, 2024

VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!

image

సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

News July 5, 2024

‘APEPDCL యాప్‌లో బిల్లులు చెల్లించాలి’

image

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్తు బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లించవద్దని ఏపీఈపీడీసీఎల్ సహాయ గణాంక అధికారిణి ఎం.కుసుమకుమారి ఒక ప్రకటనలో సూచించారు. వినియోగదారుల APEPDCL యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని లేదా సంబంధిత డిస్కం వెబ్ సైట్‌లో బిల్లులు చెల్లించాలని సూచించారు.

News July 5, 2024

VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!

image

సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.