News April 12, 2025
విజయనగరం: నేడే ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లాలో ఫస్టియర్ 20,902 మంది, సెకండియర్ 18,384 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 13, 2025
VZM: ‘నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర ఎనలేనిది’

ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సీసీ కెమెరాల పాత్ర ఎనలేనిదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ప్రజల భద్రతలో సీసీ కెమెరాల పాత్రను గుర్తించి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో నూతనంగా 3000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకొని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా స్థానికుల సహకారంతో 2125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు.
News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. 12 వ స్థానంలో విజయనగరం జిల్లా

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విజయనగరం జిల్లాలో 17,636 మందికి 11,525 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,512 మంది పరీక్షలు రాయగా 12,340 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా 15వ స్థానంలో నిలిచింది.
News April 12, 2025
VZM: ‘14న PGRS కార్యక్రమం రద్దు’

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 14న జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగనున్న PGRS కార్యక్రమాన్ని రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ రోజు వినతులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని సూచించారు.