News August 26, 2025

విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

image

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.

Similar News

News August 26, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: SP

image

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో SP వకుల్ జిందల్ నేడు సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News August 25, 2025

రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్క‌ర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామన్నారు. మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

News August 25, 2025

విజయనగరం: ‘60% పెరిగిన మహిళా ప్రయాణికులు’

image

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నాలుగు రకాల బస్సుల్లో మొత్తం 6,17,206 మంది ప్రయాణించగా.. వారిలో వీరిలో 3,26,939 మంది మహిళలు ఉన్నారన్నారు. టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.