News April 29, 2024

విజయనగరం : ప్రమాదానికి గురైన ఆర్మీ జవాన్

image

విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 21, 2025

చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

image

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

News April 21, 2025

విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్‌ డే

image

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.

News April 21, 2025

తెట్టంగిలో బంగారం చోరీ

image

గుర్ల మండలంలోని తెట్టంగిలో ఐదున్నర తులాల బంగారం దొంగతనం అయినట్లు ఎస్సై పి.నారాయణ రావు సోమవారం తెలిపారు. తెట్టంగికి చెందిన జమ్ము పాపి నాయుడు ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.

error: Content is protected !!