News February 6, 2025
విజయనగరం: మొన్న మూడు.. నిన్న నిల్..!

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
Similar News
News February 8, 2026
మహిళల రక్షణకు శక్తి యాప్‌ను వినియోగించండి: VZM ఎస్పీ

మహిళల భద్రతకు ప్రభుత్వం రూపొందించిన శక్తి (SOS) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, విద్యార్థిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా SP ఎ.ఆర్. దామోదర్ ఆదివారం పిలుపునిచ్చారు. ఆపద సమయంలో యాప్‌లోని SOS బటన్ నొక్కితే క్షణాల్లో పోలీసులు లొకేషన్‌కు చేరుకుంటారని ఆయన తెలిపారు. యాప్‌లో సేఫ్ ట్రావెల్, నైట్ షెల్టర్లు, పోలీస్ స్టేషన్ నంబర్లు, ఫిర్యాదు సౌకర్యం వంటి సేవలు ఉన్నాయని వెల్లడించారు.
News February 8, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలోని మలుపువద్ద ఉన్న స్తంభాన్ని బైక్ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి (41) మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. ఆదివారం మృతిడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.
News February 8, 2026
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు: చిన్న శ్రీను

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత ల్యాబ్‌లు అయిన NDRI, NDDB తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందన్నారు. మాట మార్చడంలో CM సిద్ధహస్తుడన్నారు.


